telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

సన్యాసం తీసుకున్న బద్వేల్ మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ

ఈ కాలంలో ఎమ్మెల్యే కావడం మామూలు విషయం కాదు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇంకా ఎన్నోన్నో పనులు చేస్తే కానీ ఎమ్మెల్యే కాలేరు. అలాగే ఎమ్మెల్యే అయినప్పటికీ.. ఆ పదవిని కాపాడుకోవడం ముఖ్యమే. ఒక్కసారి ఓడిపోతే.. వాళ్ల పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ఓడిపోతే కొందరు నాయకులైతే.. రాజకీయ సన్యాసం తీసుకుంటారు. అయితే..కడప జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సన్యాసాన్ని స్వీకరించాడు. ఉమ్మడి రాష్ట్రంలో దివంగత సీఎం రాజశేఖర్‌రెడ్డి హయాంలో జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన ప్రస్తుతం సర్వసంగ పరిత్యాగిలా మారిపోయారు. సర్వం త్యజించారు. కాషాయ దుస్తులను ధరించారు. ఆయనే.. వీ శివరామకృష్ణారావు. కడప జిల్లాలోని బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మరోసారి పోటీ చేసి.. ఓటమి పాలయ్యారు. అయితే… ఇవాళ ఉదయం తూ. గోదావరి రాజమహేంద్రవరంలో గోదావరి తీరంలో సన్యాసాన్ని స్వీకరించినట్లు తెలుస్తోంది. జీవితం మీద విరక్తి చెందో లేదో.. రాజకీయాలంటే నచ్చకో ఏమో కానీ తన జీవితాన్ని మాత్రం సన్యాసానికి సమర్పించుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

Related posts