telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్… పవన్ కళ్యాణ్ వీడియో వైర‌ల్‌

ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న పరిస్థితులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్య ట్వీట్లతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రోడ్ల అధ్వాన్న స్థితిపై ఛిద్రమైన రహదారి అంటూ ఓ వీడియోతో పాటు… ప్రత్యేక వ్యంగ్య చిత్రాన్ని ట్వీట్ చేశారు.

#GoodMorningCMSir అనే డిజిటల్ క్యాంపెయిన్‌లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం 8 గం.కు రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళే రోడ్డు దుస్థితిని తెలిపే వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోలో కొత్తపేట దగ్గర ఉన్న గుంతలు, అక్కడి పరిస్థితి తెలుస్తోంది. ఈ వీడియోను పోస్టు చేస్తూ #GoodMorningCMSir అని హ్యాష్ ట్యాగ్ వేశారు.

రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్

రోడ్డు మీద ప్రయాణం సర్కస్ ఫీట్‌లా ఉంటుంది. రాష్ట్రంలో రోడ్డు ప్రయాణం ఎంత నరకప్రాయంగా మారిందో తెలుస్తుంది. హెలికాప్టర్‌లో వెళ్తున్న సీఎం రోడ్డు మీద ద్విచక్ర వాహనాలపై వెళ్ళే వాళ్ళను వింతగా చూస్తుంటారు. ఒక్కో గోతిలో నుంచి గాల్లో ఎగిరి అంతా దూరాన మరో గోతిలో ఉన్న నీళ్ళలో పడుతుంటే… వారి వాహనాలు గాల్లో ఉన్నట్లు ఆ వ్యంగ్య చిత్రం ఉంది. రాష్ట్రంలో రోడ్లపై ప్రయాణిస్తున్నవారి పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో కార్టూన్ ద్వారా అర్ధమవుతుంది.

Related posts