telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇవాళ ఏపీ కేబినెట్‌ సమావేశం…వీటిపై కీలక చర్చ

cm jagan

ఏపీ మంత్రి మండలి సమావేశం ఇవాళ జరగనుంది. ఇటీవల కాలంలో మంత్రి మండలి సమావేశం తేదీలు ప్రకటించడం, వాయిదా పడటం జరుగుతోంది. ప్రతి నెల తొలి, మూడో బుధవారాల్లో సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. కానీ ఆ షెడ్యూల్‌ అమలు కావడం లేదు. ఏదీ ఏమైనా ఏపీ కేబినెట్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. సచివాలయం ఒకటో బ్లాక్‌లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామిక వేత్తలుగా చేసేందుకు ఇటీవల విడుదల చేసిన ప్రత్యేక పారిశ్రామిక విధానానికి (జగనన్న వైఎస్సార్‌ బడుగు వికాసం పథకం ) కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే నూతన ఇసుక విధానంపై కేబినెట్‌ చర్చించనున్నట్లు సమాచారం అందుతోంది. మచిలీపట్నం పోర్టుకు సంబంధించి డీపీఆర్‌పై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు…పోలవరం సందిగ్ధత, స్థానిక సంస్థల ఎన్నికల వివాదం, దిశా చట్టంలో సవరణలు లాంటి అంశాలపై కేబినెట్‌ చర్చ జరుగనుంది.

Related posts