telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు !

విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూముల్లో దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందనే వార్తలతో… ఏపీలోని ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీలు ఉక్కు ఉద్యమంలోకి దిగాయి. గంటా శ్రీనివాస్‌ ఏకంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో విశాఖ స్టీల్‌ ప్లాంటు ప్రైవేటీకరణపై బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు స్పందించారు. దీనిపై సోమవారం కేంద్రమంత్రి అమిత్‌ షాను కలుస్తామన్నారు. స్టీల్‌ ప్లాంటును కారు చౌకగా అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఇక కేంద్ర పథకాలను వైసీపీ సర్కారు తమ సొంత నిధులతో చేపట్టినట్లు బిల్డప్‌ ఇస్తోందని మండిపడ్డాడు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూనే పేరు మాత్రం జగన్‌కు రావాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు.

Related posts