telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్టార్‌ డైరెక్టర్‌తో ఎంజాయ్‌ చేస్తున్న తమన్నా !

15 ఏళ్ల వయసులోనే తమన్నా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ చిత్రంలో నటించింది. అదే ఏడాది తెలుగులో శ్రీ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఇక, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ చిత్రం తెలుగులో తమన్నాకు మంచి బ్రేక్ అందించింది. అప్పటినుండి మిల్కీ బ్యూటీ తమన్నా దాదాపుగా టాలీవుడ్ అగ్రహీరోలందరితో కలిసి నటించింది.  అప్పుడే శేఖర్ కమ్ముల ఆమెను ‘హ్యాపీడేస్’ మూవీలో బుక్ చేసుకున్నారు. అందులో మధు పాత్రలో చక్కగా ఒదిగిపోయింది తమన్నా. అప్పటి వరకూ ఉత్తరాది భామగా ఉన్న ఇమేజ్ తొలగిపోయింది. మన తెలుగమ్మాయే అనిపించేలా శేఖర్ కమ్ముల… తమన్నాను తీర్చిదిద్దారు. ఇక ఆ తర్వాత మిల్కీ బ్యూటీ వెనుదిరిగి చూసుకున్నదే లేదు. ఆ సినిమా దర్శకుడు శేఖర్ కమ్ములను ఇటీవల అనుకోకుండా తమన్నా కలిసింది. తన మనసులోని హ్యాపీ నెస్ ను ఏ మాత్రం దాచుకోకుండా వ్యక్తం చేసింది. శేఖర్ కమ్ముల కలవడంతో తన ‘హ్యాపీడేస్’ ను గుర్తు చేసుకున్న తమన్నా… దానికి సంబంధించిన ఫోటోలనూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

Related posts