క్వారంటైన్‌లో ఉన్నవారి కోసం అవగాహన కల్పించేందుకు వరంగల్ అర్బన్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ‘టెలీ మెడిసిన్’ కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లలితాదేవి ప్రారంభించారు. కరోనా వైరస్ సందర్భంగా ప్రాథమిక చికిత్స కోసం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు 79939 69104, 79951 18405 నంబర్లతో పాటు వాట్సప్ వీడియో కోసం 93924 693440 నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు.
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. మానసిక వైద్యుడితో పాటు జనరల్ ఫిజీషియన్ కూడా ఉంటారని, ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్న పక్షంలో సంబంధిత మొబైల్ నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన టెలీ మెడిసిన్‌ను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ లలితాదేవి తెలిపారు.