ఆన్‌లైన్ పాఠాలు బోధన విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ పేర్కొన్నారు. బుధవారం డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్ లెక్చరర్లు, రెండుశాఖ అధికారులతో కమిషనర్ వెబ్‌నార్ (జూమ్) యాప్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
భవిష్యత్‌లో ప్రభుత్వ డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలతోపాటు ప్రైవేట్ కాళాశాలల్లో కూడా ఆన్‌లైన్ లో పాఠాల కోసం డిజిటల్ కాంటెంట్ సిద్ధంగా ఉన్నదని చెప్పారు. అంతర్జాతీయస్థాయిలోని కోర్స్‌ఎరా కూడా ఉచితంగా డిజిటల్ పాఠాలు అందించడానికి ముందుకొచ్చిందని తెలిపారు.