telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విగ్గు వద్దు… జుట్టే ముద్దు అంటున్న బాలయ్య

Balakrishna

బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో నటిస్తు్న్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ఆయన ఇంపోర్టెడ్ విగ్గులు తెప్పించుకున్నారట. అయితే ఇక నుంచి విగ్గులు పెట్టుకోదలచుకోకూడదని బాలయ్య నిర్ణయించుకున్నారట. కొంతకాలంగా ఆయన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్స తీసుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే అది సక్సెస్ కాలేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం. అందుకే బాలయ్య కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సర్జరీ చేస్తున్నారు కాబట్టి వీలైంతవరకు విగ్గులు పెట్టుకోకపోవడమే ఉత్తమం అని డాక్టర్స్ చెప్పారట. సినిమా షూటింగ్ పూర్తయ్యాక మరోసారి హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకుంటున్నారట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ఆయన లుక్ విగ్గుల వల్లే పోతోంది. దాని వల్ల సినిమాలో ఆయన పాత్రలకు ఉండాల్సిన ఎసెన్స్ పోతోందని బాలయ్య భావిస్తున్నారట.

Related posts