telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం..

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ప్రధానంగా వచ్చే జనవరి 26వ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్న “జగనన్న అమ్మ ఒడి” పథకం మార్గదర్శకాలను ఈ సమావేశంలో మంత్రివర్గం ఖరారు చేయనుంది. నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం ఏర్పాట్లపై కేబినెట్‌లో చర్చించనున్నారు. అలాగే నవంబర్‌లో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా సమీక్షించనున్నారు.

ప్రభుత్వాస్పత్రుల్లో ఉచితంగా 500 రకాల మందుల పంపిణీ, నవంబర్ 2న వైఎస్సార్ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం, పాఠశాలలు నాడు-నేడు కార్యక్రమం, అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కుల పంపిణీ, ఇసుక వారోత్సవాల నిర్వహణపై కేబినెట్‌లో చర్చలు జరపనున్నారు. అలాగే మహిళలు, పిల్లలు తీవ్ర రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న 77 గిరిజన మండలాల్లోని 1,642 గ్రామ పంచాయతీల్లో అదనపు పౌష్టికాహారం అందించేందుకు చేపట్టనున్న పైలెట్‌ ప్రాజెక్టుపై కేబినెట్‌లో చర్చించనున్నారు.

Related posts