telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ … నూతన సంవత్సర రెసొల్యూషణ్ … అదేనట..

kcr and committee meet on rtc

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కొత్త తీర్మానాన్ని చేశారు. తొలుత రాష్ట్ర ప్రజలందరికీ కేసీఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదున్నర సంవత్సరాలు అయిందని ఈ ఐదున్నర సంవత్సరాలలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిచిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం అగ్రగామి రాష్ట్రంగా నిలిచినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రజలంతా సంకల్ప సాధనకు గతంలో సాధించిన విజయాలు ఇచ్చిన స్పూర్తితో మరింత ఉత్సాహంగా కృషి చేయాలని అన్నారు. 2020 సంవత్సరంలో సీఎం కేసీఆర్ ఈచ్ వన్ టీచ్ వన్ అనే సరికొత్త నినాదం, సంకల్పాన్ని ఇచ్చారు. 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రంను తీర్చిదిద్దాలన్నదే ఈ నినాదం లక్ష్యమని కేసీఆర్ చెప్పారు.

ప్రతి తెలంగాణ పౌరుడు కనీసం ఒక్కరికైనా విద్య నేర్పించాలన్నదే ఈ సంకల్పం లక్ష్యమని సీఎం చెప్పారు. ప్రతి ఒక్కరు ఇందుకోసం ప్రతిజ్ఞ తీసుకోవాలని కేసీఆర్ సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న ప్రతి ఒక్కరు కనీసం ఒక్కరికైనా విద్య నేర్పాలని అలా చేస్తే 2021 జనవరి 1 నాటికి తెలంగాణ రాష్ట్రం 100 శాతం అక్షరాస్యతా రాష్ట్రంగా ఆవిర్భవిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ తన సంకల్పంలో పాలు పంచుకోవాలని సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ ఈచ్ వన్ టీచ్ వన్ నినాదాన్ని పాటిస్తామని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం 100 శాతం అక్ష్యరాస్యత సాధించటానికి తమ వంతుగా కృషి చేస్తామని ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.

Related posts