telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే..?

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఉదయం… అఖిలపక్ష నేతలను సమావేశానికి పిలిచిన… ఎస్ఈసీ ఆ తర్వాత సీఎస్ నీలం సాహ్నీతో సమావేశమయ్యారు. ప్రభుత్వ పరంగా ఎన్నికలకు ఏర్పాట్లపై చర్చించారు. ఆ తర్వాత… పంచాయతీ రాజ్ కమిషనర్.. గిరిజా శంకర్‌తోనూ భేటీ అయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల  పరిస్థితులపై ఇద్దరు అధికారులతో ఎస్ఈసి చర్చించినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావంతో అసలు ఎన్నికల నిర్వాహణ సాధ్యమేనా? అనేదానిపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. ఈ భేటీలో భేటీలో రాష్ట్రంలోని కరోనా పరిస్థితిపై చర్చ జరగ్గా వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వోద్యోగులు కరోనా బారిన పడ్డారని ఎస్ఈసీకి సీఎస్ లెక్కలతో వివరించినట్టు చెబుతున్నారు. కీలకమైన పోలీసు శాఖలో వేల సంఖ్యలో కరోనా కేసులున్నట్టు ఎస్ఈసీ దృష్టికి సీఎస్ తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక ఎన్నికల నిర్వహాణ అనేది కష్టమనే భావనను సీఎస్ నీలం సాహ్నీ వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. పరిస్థితులు కుదటపడగానే ఎస్ఈసీని సంప్రదిస్తామని, అలానే కరోనా పరిస్థితులను ఎస్ఈసీకి ఎప్పటికప్పుడు వివరిస్తామని తెలిపారు.  

Related posts