telugu navyamedia
సినిమా వార్తలు

“ఎన్టీఆర్ : మహానాయకుడు” ట్రైలర్

NTR-biopic

దివంగత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో “ఎన్టీఆర్ బయోపిక్” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం… మొదటి భాగం “ఎన్టీఆర్ : కథానాయకుడు” సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. దీంతో రెండవ భాగమైన “ఎన్టీఆర్ : మహానాయకుడు” చిత్రంపై భారీ అంచనాలు పెరిగేలా దృష్టి సారించింది చిత్రబృందం. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో ”ఇచ్చిన ప్రతీమాట నిలబడాలి.. చేసిన ప్రతీపని కనపడాలి.. ఇన్ టైం… ఆన్ డాట్… అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్, ”చెప్పేటోళ్ళు ఉండాలి… లేకపోతే ఆరు కోట్ల మంది ఆయన పక్కన ఉన్నా ఒంటరోడు అయిపోతాడు” అంటూ చంద్రబాబు పాత్రను పోషిస్తున్న రానా చెప్పిన డైలాగ్ లు సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇక ”నిశ్శబ్దాన్ని చేతకానితనం అనుకోవద్దు… మౌనం మారణాయుధంతో సమానం… నేను రాజకీయాలు చేయడానికి రాలేదు.. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చాను” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగులు హైలెట్ గా నిలిచాయి.

Related posts