telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సల్మాన్ అంకుల్ న్యాయం చేయండి… హీరోయిన్ సెటైర్

rakhi savanth on pulwama attack

బాలీవుడ్ నటి, ఐటెం డ్యాన్సర్ రాఖీ సావంత్ తో పెట్టుకోవడం అంటే బురదలో రాళ్లు వేసినట్లేనని అందరికీ తెలుసు. అయితే రాఖీ సావంత్ పెళ్లయ్యాక సైలెంట్‌గా ఉండిపోయారు అనుకునేలోగా… ఇప్పుడు బిగ్ బాస్‌ను టార్గె్ట్ చేసింది. అసలేం జరిగిందంటే.. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 13లో షఫాలీ జరీవాలా, షెహనాజ్ అనే ఇద్దరు మహిళా కంటెస్టెంట్స్ కొట్టుకున్నారు. దాంతో షఫాలీ.. షెహనాజ్‌పై కామెంట్ చేస్తూ.. ‘నువ్వు ఒక్కోసారి నాకు పంజాబీ రాఖీ సావంత్‌లా కనిపిస్తావ్’ అని కామెంట్ చేసింది. ఈ విషయం కాస్తా రాఖీ దృష్టికి రావడంతో ఏకిపారేసింది. ‘బిగ్ బాస్‌లో పాల్గొన్న కంటెస్టెంట్లను ఓ ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. మీరెందుకు నా వెనక పడ్డారు. సల్మాన్ అంకుల్ మీరు నాకు మంచి స్నేహితుడు. నాకు న్యాయం కావాలి. మాటిమాటికీ కరణ్ జోహార్ తన షోలో నా పేరును వాడుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మీ బిగ్ బాస్ వాళ్లు నా పేరును వాడుకుంటున్నారు. నేను కూడా మనిషినే. నా పేరును గౌరవించండి. బిగ్ బాస్ నా ఫేవరేట్ షో. అలాగని మీరు ఇష్టమొచ్చినట్లుగా నా పేరును వాడుకోవాలని కాదు. బిగ్ బాస్ నా ఇంటికి వచ్చి నాతో మాట్లాడాలి. నా పేరును వాడుకుంటూ ఎగతాళి చేస్తున్నవారిని బిగ్ బాస్ పనిష్ చేయాలి. ఇంకోసారి నా పేరును వాడుకుంటే పరువు నష్టం దావా వేస్తాను’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు పోస్ట్ చేసింది రాఖీ.

Related posts