telugu navyamedia
సినిమా వార్తలు

షాకింగ్ లుక్ లో మెగాస్టార్…!!

Amitab-Bachchan

బాలీవుడ్ మెగాస్టార్ 76 ఏళ్ళ వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తున్నారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ఇప్పటికీ భారీ క్రేజ్ తో ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు అమితాబ్. ఒక్క బాలీవుడ్ లోనే కాదు తన పాత్రకు ప్రాధాన్యం ఉంటే ఏ భాషలోనైనా నటించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తెలుగులో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “సైరా”లో కీలకపాత్రలో నటించారు. తమిళంలోనూ ఆయన తన తొలి సినిమా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం అమితాబ్, సాహోజిత్ సర్కార్ దర్శకత్వంలో “గులాబో సితాబో” అనే సినిమా చేస్తున్నారు. కామెడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అమితాబ్ లుక్ హైలైట్‌గా ఉండబోతోంది. అయితే ఈ చిత్రం నుంచి తాజాగా విడుదలైన లుక్ అందరినీ షాక్ కు గురిచేస్తోంది. బాగా పెరిగిన గడ్డంతో వృద్ధుడిగా అమితాబ్ కనిపించబోతున్నారు. ఇంతముకుందెన్నడూ అమితాబ్ ఇలాంటి లుక్ లో కన్పించలేదు. షీలా కుమార్, రోనీ లాహిరి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్‌లో అమితాబ్ గత మంగళవారం నుంచి పాల్గొంటున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 24, 2020లో విడుదల కానుంది.

Related posts