telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐశ్వర్యరాయ్ కి అన్నగా నటించి తప్పుచేసా : షారుక్‌ ఖాన్‌

sharooq

ఐశ్వర్యరాయ్ కి నేను అన్నగా నటించినందుకు ఇప్పటికీ బాధపడుతుంటానని ఓ ఆవార్డు కార్యక్రమంలో వెల్లడించాడు షారూక్ ఖాన్. కాగా ఈ కార్యక్రమంలో షారుక్‌, ఐశ్వర్యకు ఆవార్డును ప్రదానం చేశాడు. అనంతరం షారుక్‌ ఖాన్‌ మాట్లాడుతూ.. ‘ఐశర్య విషయంలో నేను చాలా దురదృష్ట​ వంతుడిని. ప్రపంచ సుందరి అయిన ఐశ్వర్యకు మా మొదటి చిత్రం ‘జోష్’‌లో సోదరుడిగా నటించాను. అందులో మేమీద్దరం కవల పిల్లలం. అంతేకాదు కవలలుగ నటించిన మా ఇద్దరిని చూసి ఒకేలా ఉన్నారంటూ అందరూ చెప్పేవారు. ఇప్పటికీ కూడా మేమీద్దరం ఒకేలా ఉంటామన్న భ్రమలోనే ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సంజయ్‌ లీలా భాన్సాలీ దర్శకత్వంలో వచ్చిన వీరిద్దరి రెండవ చిత్రం ‘దేవదాస్’‌ గురించి చెబుతూ.. ‘‘ ఇందులో మేము ప్రేమికులుగా నటించాం. కానీ ఈ సినిమాలో నేను, తనని విడిచి పెట్టాను. తిరిగి నేను ఐశ్వర్యను ప్రేమించినప్పటికీ అప్పటికి ఆమె నన్ను విడిచి పెట్టింది. అయితే ఒక్క విషయంలో మాత్రం అదృష్టవంతుడి కనీసం ఒక్కసారైనా తెరపై ఐశ్వర్యను ప్రేమించే అవకాశం వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.

;

Related posts