telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

నిమ్మగడ్డ తీరుపై  త్వరలోనే గవర్నర్ ను కలవనున్న ప్రభుత్వం…

Nimmagadda ramesh

ఎస్ఈసీ నిమ్మగడ్డ తీరును సీరియస్సుగా పరిగణిస్తుంది ప్రభుత్వం. నిమ్మగడ్డ లక్ష్మణ రేఖ దాటారని భావిస్తుంది జగన్ సర్కార్. ఎస్ఈసీ పరిధిని మించి వ్యవహరించారని అభిప్రాయపడుతుంది ప్రభుత్వం. నిమ్మగడ్డ తీరును తప్పు పడుతూ గవర్నరును కలిసే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు తెలుస్తుంది. ప్రజా ప్రతినిధుల విషయంలో ఇష్టానుసారంగా ఎస్ఈసీ వ్యవహరిస్తున్నారనే అంశంపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసే అంశంపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఎస్ఈసీ పరిధిని ఫిక్స్ చేసేందుకు కోర్టు తలుపు తట్టే యోచనలో సర్కార్ ఉంది. ఏకగ్రీవాలపై ప్రభుత్వ ప్రకటనను తప్పు పట్టిన నిమ్మగడ్డ.. నిబంధనలకు విరుద్దంగా విడుదల చేసిన టీడీపీ మేనిఫెస్టోపై పెదవి విప్పకపోవడాన్ని వైసీపీ ప్రశ్నిస్తుంది. ఇక ఇదిలా ఉంటె, ఈరోజు ఎన్నికల కమిషనర్ కడపజిల్లాలో పర్యటిస్తున్నారు.  కడపలో పంచాయతీ ఎన్నికల పనితీరును తెలుసుకునేందుకు అయన కడప వెళ్లారు.  పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని, అసాధారణంగా ఏకగ్రీవాలు మంచిది కాదని అన్నారు.  ఎవరి ఆశీస్సులతో తాను ఎస్ఈసి కాలేదని తెలిపారు.  ఏకగ్రీవాలపై ఒత్తిడి తీసుకొచ్చేవారిపై నిఘా ఉంటుందని అన్నారు. 

Related posts