telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రాజధాని గురించి గ్రాఫిక్స్ చూపను: సీఎం జగన్

cm jagan on govt school standardization

 ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఏపీ సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  రాజధాని విషయంలో ‘బాహుబలి’ లాంటి గ్రాఫిక్స్ చూపాలని తాను అనుకోవట్లేదని ఆయన అన్నారు. ‘ప్రజలను మభ్యపెట్టాలని, గ్రాఫిక్స్‌ చూపించాలని నేను అనుకోవట్లేదు. జపాన్, సింగపూర్‌ నగరాలను సృష్టించేంత నిధులు మా దగ్గర లేవని నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రిగా తాను ఏం చేయగలనో ఆ వాస్తవాలను మాత్రమే చెబుతున్నాను. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నీళ్లు అందించేందుకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాం. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని వ్యాఖ్యానించారు.ఒక తండ్రిలా నిర్ణయం తీసుకున్నాను కాబట్టే అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ప్రతిపాదనలు చేశామని తెలిపారు.

Related posts