telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

అమితాబ్ మనవరాలు ఆ హీరోతో ప్రేమలో ఉందా…?

నవ్య నవేలీ నందా… ఈ పేరు ఇప్పుడు బాలీవుడ్ ను ఫాలో అయ్యే అందరికీ తెలుసు. ముఖ్యంగా, టీనేజ్, యంగ్ నెటిజన్స్ కు ఈమె పట్ల బోలెడు క్రేజ్. అయితే, నవ్య ఏ బాలీవుడ్ సినిమాలోనో నటించటం లేదు. ఆమె బిగ్ బి కూతురు శ్వేత నందాకి వారసురాలు. అలా నవ్యకి ఇన్ స్టాగ్రామ్ లో చెప్పలేనంత ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మధ్య ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ చాలా మంది మనస్సుల్లో ఉన్న అనుమానానికి సమాధానంగా చక్కర్లు కొడుతోంది. నవ్య పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ కావటానికి కారణం… అందులో ఆమె రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ మీజాన్ జాఫ్రీ ఉండటమే. సీనియర్ నటుడు జావేద్ జాఫ్రీ కొడుకైనా మీజాన్ 2019లో ‘మలాల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో అతని నటనకిగానూ ‘టైమ్స్ మెన్ ఆఫ్ ద ఇయర్ 2020’ లిస్ట్ లో చోటు దక్కింది. అభినందపూర్వకంగా ఓ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఆ సర్టిఫికెట్ ఆఫ్ రికగ్నీషన్ చేతిలో పట్టుకునే మీజాన్ కెమెరాకి ఫోజిచ్చాడు. తరువాత తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా చేశాడు!. మీజాన్ జాఫ్రి సర్టిఫికెట్ చూసి అతని అకౌంట్లో ‘వావ్’ అంటూ కామెంట్ చేసిన నవ్య మళ్లీ అతని పోస్ట్ ని తన ఖాతాలో రీపోస్ట్ కూడా చేసింది. ‘కంగ్రాచ్యులేషన్స్’ అని రాసింది. ఈ హుషారంతా చూసి… అతనే ఆమె మనసు దోచిన ప్రియుడు అంటున్నారు బీ-టౌన్ జనం. దీనిపై మీజాన్, నవ్య నందా ఇంత వరకూ స్పందించలేదుగానీ వీరి డేటింగ్ ఇక మీదట పబ్లిక్ సీక్రెట్టే అంటున్నారు బాలీవుడ్ లోని వారు…

Related posts