telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రతీకారం

తీర్చుకోవడానికి కాదు
ఎదుటివారి
ప్రవర్తనలో మార్పుకోసం ప్రయత్నిద్దాం
ప్రతీకారం
కోపాన్ని రెట్టింపుచేసి
వినాశనాన్ని సృష్టిస్తే…
మార్పు అనేది
మనిషిని మహోన్నతుడిని చేసి
సమాజానికి ఉపయోగపడేలా చేస్తుంది
కోప తాపాలు
ఎప్పటికైనా అశాశ్వతాలే
ఒక్క ప్రేమా
ఆప్యాయతలు మాత్రమే శాశ్వతం
ప్రశాంతమైన హృదయం
ఎప్పుడూ దైవ మందిరమేగా
అందులో కొలువై ఉన్న దైవం
నిష్కల్మషమైన ప్రేమేగా…
పరుషమైన మాట
అగ్నికి ఆజ్యం పోస్తే
ఆత్మీయతతో కూడిన మాట
అందరి హృదయాలకు దగ్గరౌతుంది
ప్రేమించడం తెలిసిన హృదయాలకు
ప్రేమను పంచడం మాత్రం తెలియనిదా
ఈ ఉషోదయ కిరణాల సాక్షిగా
మనం మనంగా జీవిద్దాం
మంచినే జీవిత లక్ష్యంగా ఎంచుకుందాం.

Related posts