telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఈవీఎంలపై హడావుడి .. మీడియా దారి మళ్లించేందుకేనా…. ! సీపీఐ కి కూడా అనుమానాలు..

CPI Sudhakar Reddy Slams KCR

దేశంలో ఈవీఎంల పనితీరు గురించి, వీవీ ప్యాట్ల గురించి ఏళ్లగా చర్చ జరుగుతోంది. ఈవీఎంలను సులభంగా ప్రభావితం చేసే వీలుందన్న ఆరోపణల నేపథ్యంలో వీవీ ప్యాట్ల ద్వారా ఈవీఎంలకు విశ్వసనీయత వస్తుందని అనేక పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఈవీఎంలు, వీవీ ప్యాట్ల విషయంలో స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సజావుగా, లోపరహితంగా జరగడం ఎంతో అవసరం అని అభిప్రాయపడ్డారు.

ఈవీఎంలతో మోసాలకు తావులేదని ప్రజల్లో నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ఈసీకి ఉందని సురవరం సూచించారు. తాజా ఎన్నికల్లో పలు చోట్ల ఈవీఎంలు మొరాయించడం అపనమ్మకాలకు కారణమవుతోందని అన్నారు. జరిగిన పరిణామాలు చూస్తుంటే కేంద్రం ఒత్తిడికి ఎన్నికల సంఘం లొంగిపోయినట్టుగా కనిపిస్తోందని సందేహం వ్యక్తం చేశారు. వీవీ ప్యాట్ల విషయంలో తాము కేసు వేశామని సురవరం చెప్పారు.

Related posts