telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొత్త గెటప్‌లో హీరో రామ్‌

మాస్ మసాలా దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ అంటే ఏంటో చూపించే విధంగా ఇస్మార్ట్ శంకర్ సినిమా తో రామ్ మళ్లీ హిట్ ట్రాక్ పట్టాడు. ఈ సినిమాలో రామ్ చేసిన మాస్ యాక్టింగ్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ సంపాదించాడంటే నమ్మండి. దీని తరువాత రామ తెరకెక్కించిన సినిమా రెడ్.  ఇందులో రామ్ సరసన మాళవికా శర్మ హీరోయిన్ గా నటించగా నివేతా పెతురాజ్ కీలక పాత్రలో నటించింది. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మించగా, మణిశర్మ సంగీతం అందించాడు. ఇందులో రామ్ రెండు విభిన్నమైన పాత్రలో నటించాడు. మొన్న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్‌ అయింది. రిలీజైన ఈ మూవీ ఇప్పటికే మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇది ఇలా ఉండగా.. రామ్‌ ప్రస్తుతం శివుని మాలను వేసుకుని దీక్ష చేస్తున్నారు. ఈ మాలను వేసుకోవడంతో 41 రోజుల పాటు దీక్ష ఉండాలని.. అందుకే కొన్నాళ్ల పాటు సినిమాలకు బ్రేక్‌ తీసుకువాలని అనుకున్నాడు. తాను శివుని మాలతో ఉన్న ఫొటోను తన సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు రామ్‌. “ఓం నమః శివాయ, చిన్న బ్రేక్‌ తీసుకున్నాను. మళ్లీ వస్తాను” అంటూ రామ్‌ పోస్ట్‌ చేశాడు. 

Related posts