కుంభమేలను తలపించే మేడారం మహా జాతర రెండో రోజూ అత్యంత వైభవంగా కొనసాగుతోంది. బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ మేడారం గద్దెకు చేరుకోవడంతో జాతర తొలిఘట్టం పూర్తయింది. మరోవైపు పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజు, కొండాయి నుంచి గోవిందరాజు తరలివచ్చి మేడారం గుడి వద్ద సారలమ్మకు స్వాగతం పలికారు.
ముగ్గురు దేవతల రాకతో జాతర ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ఒగ్గుపూజారుల జగ్గు చప్పుళ్లతో శివశాత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. సమ్మక్క తల్లి నేడు గద్దెలపైకి చేరుకోనుంది. చిలుకలగుట్టపై నుంచి సమ్మక్కను పూజారులు తీసుకురానున్నారు. కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్కకు పూజలు నిర్వహించనున్నారు.
నా గురించి దేవేగౌడ అసత్యాలు మాట్లాడారు: సిద్ధరామయ్య ఫైర్