telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రియల్ ఎస్టేట్ కోసమే ఫార్మాసిటీ.. బలవంతంగా భూసేకరణ: కోమటిరెడ్డి

komati-venkat-reddy mp

రియల్ ఎస్టేట్ కోసమే తెలంగాణ ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటు చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన ఫార్మాసిటీ అనుమతులను రద్దు చేయాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌ను కలిసిన ఎంపీ.. ఫార్మాసిటీ పేరుతో జరుగుతున్న భూ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.

ఫార్మాసిటీ కోసం పేద రైతుల నుంచి భూమిని బలవంతంగా లాక్కుంటున్నారని ఆరోపించారు. వారి వద్ద ఎకరం భూమిని రూ.8 లక్షలకు కొనుగోలు చేసి కోటిన్నర రూపాయలకు విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ఫార్మా కంపెనీల కారణంగా చెరువులు, భూగర్భ జలాలు కలుషితం అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts