ఇటీవల ప్రకాశం జిల్లాలో వ్యవసాయ కూలీలు ట్రాక్టర్ ప్రమాదంలో మరణించగా, వారికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు కూలీలకు ప్రభుత్వం ఇస్తున్న పరిహారం ఏమాత్రం చాలదని అన్నారు.
విశాఖఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ మృతులకు ఇచ్చినట్టే కూలీలకు కూడా రూ.1 కోటి చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని స్పష్టం చేశారు. వైజాగ్ గ్యాస్ లీక్ బాధితుల పట్ల చూపినంత ఉదార బుద్ధి ప్రకాశం జిల్లా ట్రాక్టర్ బాధితుల విషయంలో ఎందుకు చూపరని కన్నా ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు లేఖ రాశారు.