మీరు డ్రైఫ్రూట్లను, నట్లను ఎక్కువ ఇష్టపడితే, మీకో మంచి వార్త ! అమిత రుచి, పోషకవిలువలతో పాటు, పిస్తాచియో వంటి నట్’స్ ఇంట్లోనే అధిక రక్తపోటును నయం చేయగలవు !
సాధారణంగా మనం వంటల్లో పిస్తా, జీడిపప్పు, బాదం, వాల్ నట్లు, వంటి వాటిని అనేక వంటకాలలో వినియోగిస్తాం.
ఉదాహరణకి వాల్ నట్లను చాకొలేట్ బ్రౌనీలను అలంకరించటానికి వాడతాం. పైగా అది మరింత రుచిని పెంచుతుంది ! జీడిపప్పు, బాదంపప్పులను స్వీట్ల తయారీ, బిర్యానీ వంటి బియ్యం వంటకాలలో వాడతారు.
కొంతమంది పిస్తా పప్పులను కూడా ఆహార అలంకరణలో వాడతారు. నిజానికి కేవలం నట్లనే ఆరోగ్యకర చిరుతిళ్ళు నేరుగానో, వేయించుకునో తినవచ్చు. మనం చాలాసార్లు కొన్ని పదార్థాలను వాటి ఆరోగ్యలాభాలు ఎంతో తెలీకుండానే తినేస్తాం!
కనుక, మీరు ఆరోగ్యంగా, బలంగా ఉండాలనుకుంటే, ఏదైనా తినేముందు దాని పోషకవిలువలు, ఎంత తినాలో తెలుసుకోవటం అవసరం. మీరు తినబోయే వాటి గురించి, ఇంటర్నెట్ లోనో, పోషకాహార పుస్తకాలలో చదివితే సరిపోతుంది !
మనలో చాలామందికి తెలుసు, అధిక రక్తపోటు లేదా అధిక బిపి చాలా సామాన్యంగా వచ్చే జీవనవిధాన జబ్బు. సాధారణంగా 45 ఏళ్ళ వయస్సు పై బడ్డవారిలో ఎవరికైనా ఇది రావటం చూస్తాం. ఆరోగ్యం సరిగా లేని యువతలో కూడా రావొచ్చు.
అధిక రక్తపోటు అంటే రక్తనాళాల్లో రక్తం అధిక వత్తిడితో ప్రవహించడం. ఇది రక్తనాళాల దారి ఇరుకుగా మారిపోవటం వల్ల జరుగుతుంది. అధికరక్తపోటుకి కారణాలు మానసిక వత్తిడి, అనారోగ్యకర ఆహారం, స్థూలకాయం, వ్యాయామం లేకపోవటం, అధిక కొలెస్ట్రాల్, అసహజ శ్వాసక్రియ మొదలైనవి.
అధిక రక్తపోటుకి సరైన చికిత్స అందించకపోతే, అది తలనొప్పి, అలసట, ఇంకా పెద్దవైన హృద్రోగాలకు కూడా దారితీయవచ్చు ! అందుకని అధిక రక్తపోటుకి మీరు ఇంటిచిట్కా వెతుకుతున్నట్లయితే, ఈ పిస్తా చిట్కా తెలుసుకోండి !
కావాల్సిన వస్తువులు
పొడి పిస్తా – 3-4
నీరు – 1 గ్లాసు
ఇది తరచుగా వాడితే అధిక రక్తపోటుకి బాగా పనిచేస్తుందని అంటారు. ఈ చిట్కా పాటించడంతో పాటు, అనేక జీవనవిధాన మార్పులు కూడా చేయాలి. ఆరోగ్యకర ఆహారం, వ్యాయామం వంటివి మీరోజుకి జతచేయాలి.
అధిక బరువు ఉంటే దాన్ని తగ్గించుకోవటం, అనవసర కొవ్వు పదార్థాలు, ఉప్పు ఎక్కువ ఉన్నవి తినకుండా ఉండటం వల్ల కూడా అధిక రక్తపోటును తగ్గించుకోవచ్చు. ఈ చిట్కాతో పాటు మీ డాక్టర్ సూచించిన మందులు కూడా వాడండి.
లక్షణాలన్నీ మెల్లిగా తగ్గాక, మందులను కూడా మెల్లగా తగ్గించవచ్చు. పిస్తా అనే నట్ లో అధిక యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉండి, విటమిన్ బి6, పొటాషియం, కాపర్ వంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ పోషకాలు కలిసి మీ రక్తనాళాలను శుభ్రపరిచి, రక్తాన్ని సామాన్య వేగంతో ప్రవహించేట్లా చేస్తాయి. అలా అధిక రక్తపోటు తగ్గుతుంది.
తయారీ విధానం;
సూచించిన పిస్తా పప్పులను రాత్రంతా నీటిలో నానబెట్టండి.
నీటిని జల్లెడ పట్టేసాక ఈ పప్పులను పొద్దున్నే, టిఫిన్ తిన్న వెంటనే 3 నెలల పాటు తినండి.
previous post
బీజేపీ ఎంపీ సోయం మాట తప్పారు: ఎమ్మెల్యే జోగు రామన్న