telugu navyamedia
సినిమా వార్తలు

ఆ సినిమా వదులుకున్నా… రెండ్రోజులు నిద్ర పట్టలేదు : ఐశ్వర్యా రాజేష్

Aishwarya Rajesh,Love Breakups

ఇటీవల “శైలజా కృష్ణమూర్తి” అనే స్పోర్ట్స్ డ్రామాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఐశ్వర్యా రాజేష్. ఈ చిత్రంలో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకోవడమే కాకుండా తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ తెలుగమ్మాయి తెలుగులో కంటే తమిళంలోనే నటిగా క్రేజ్ సంపాదించుకుంది. “కాక్కముట్టై” చిత్రంతో ఒక్కసారిగా తమిళ చిత్ర పరిశ్రమలో అందరి దృష్టినీ ఆకర్షించింది నటి ఐశ్వర్యా రాజేష్. అద్భుత నటిగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలోనే అగ్ర దర్శకుడు శంకర్, విశ్వనటుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న “భారతీయుడు-2″లో అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాను ఐశ్వర్య వదులుకుంది. “భారతీయుడు-2″ను వదులుకోవడం గురించి ఇటీవల ఐశ్వర్య స్పందించింది. “నాకు ‘భారతీయుడు-2’లో అవకాశం వచ్చినపుడు చాలా సంతోషపడ్డాను. గత డిసెంబర్‌లో ఆ సినిమా కోసం కాల్షిట్లు అడిగారు. అయితే ఆ చిత్రం పలుసార్లు వాయిదా పడి ఆగస్టులో ప్రారంభమైంది. ఆ సమయంలో నేను చాలా బిజీగా ఉండడంతో ‘భారతీయుడు-2’కు కాల్షీట్లు కేటాయించడం కుదరలేదు. దాంతో ఆ సినిమా వదులుకోవాల్సి వచ్చింది. కమల్ వంటి నటుడు, శంకర్ లాంటి అగ్ర దర్శకుడు కాంబినేషన్‌లోని సినిమా మిస్సవడంతో చాలా బాధపడ్డా. రెండ్రోజులు నిద్రపట్టలేదు” అని తెలిపింది.

Related posts