telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రతి గ్రామంలో 10 శాశ్వత ఉద్యోగాలు: సీఎం జగన్

cm jagan on govt school standardization

గ్రామ సచివాలయాల ద్వారా ప్రతి గ్రామంలో 10శాశ్వత ఉద్యోగాలు కల్పించామని ఏపీ సీఎం జగన్ అన్నారు. గ్రామ సచివాలయాలను గాంధీ జయంతి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా కరపలో బుధవారం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్‌ మాట్లాడుతూ గ్రామ సచివాలయాల ద్వారా జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం నెరవేరుతోందని అన్నారు.గాంధీ జయంతి రోజున ఆయన సేవలను స్మరించుకోవాలన్నారు.

అవినీతిరహిత పాలనే లక్ష్యంగా చేసిన గొప్ప ప్రయత్నమే సచివాలయ వ్యవస్థ అని సీఎం స్పష్టం చేశారు.. ప్రతి రెండువేల మంది జనాభాకు ఒక సచివాలయంను ఏర్పాటు చేసినట్లు సీఎం వివరించారు. అలాగే ప్రతి 50 ఇళ్లకు అదనంగా ఒక వాలంటీర్‌ను నియమించామన్నారు. 2020 జనవరి 1 నాటికి గ్రామ సచివాలయల్లో పూర్తి సేవలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

Related posts