లేడీ సూపర్ స్టార్ నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఇప్పట్లో ఆమె స్థాయిని అందుకునేవారే లేరని ఇండస్ట్రీ కోడై కూస్తుంది. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే. అసలైన హీరో ఆమె. ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. సాధారణంగా హీరోయిన్లకు వయసు పెరుగుతుంటే వారికున్న డిమాండ్ తగ్గుతుంటుంది. అయితే లేడీ సూపర్‌స్టార్ నయనతార క్రేజ్ మాత్రం వయసుతోపాటే పెరుగుతోంది. కాగా… నయన్ ఎప్పట్నుంచో దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమయాణం సాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సహజీవనం చేస్తున్న వీరు పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నారు. తాజా సమాచారం మేరకు వీరిద్దరి పెళ్లి ఈ సంవత్సరం చివర్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు వీరి పెళ్లి ఇక్కడ కాకుండా.. ఈ జంట విదేశాల్లో ఘనంగా పెళ్లి చేసుకొనున్నట్టు సమాచారం. పెళ్లికి సన్నిహితులు, స్నేహితులను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబందించి ఎలాంటీ అధికార ప్రకటన రాలేదు. కానీ పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు బ్యాగ్ గ్రౌండ్‌లో జరుగుతున్నాయని తమిళ చిత్ర వర్గాల సమాచారం. నయనతార, విఘ్నేష్ శివన్ “నేనూ రౌడీనే” సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ఇకా అప్పటి నుంచి ఈ ఇద్దరు కలిసి ఫిల్మ్ ఫంక్షన్స్‌కు అటెండ్ కావడం, వివిధ విహార యాత్రలకు వెళ్లడం… అంతేకాదు వాటికి సంబందించిన ఫోటోస్‌ను సోషల్ మీడియాలో పంచుకోవడం తెలిసిందే.
previous post