telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

యూట్యూబ్‌ ఛానెళ్లపై రాములమ్మ ఫైర్‌

బీజేపీ నేత విజయశాంతి యూట్యూబ్ ఛానెళ్లపై విమర్శలు చేశారు. “ఏవో కొన్ని సినిమాలను, కొందరు నటులను నేను మెచ్చుకున్నట్టు, కొన్ని సందర్భాలలో విమర్శించినట్లు పలు YouTube ఛానెళ్ళు అబద్ధపు ప్రచారాలతో వాళ్ళు బతికి, తెలంగాణలో ఆ సినిమాలకు పబ్లిసిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. వీటిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అడుగుతున్న అభిమానుల అభిప్రాయాలను తీవ్రంగా పరిగణనలోకి తీసుకుందాం. నేను ఏం చెప్పాలనుకున్నా స్వయంగా మీడియా ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా స్పందిస్తాను. ఇంకా చెప్పాలంటే, నాటి మా తెలంగాణ ఉద్యమాన్ని ఆనాడు సమర్ధించని ఏ ఒక్క సినిమా హీరో చిత్రాలను గాని, వ్యక్తులను గాని నేడు కేసీఆర్ గారు ఒక అవగాహనతో సమర్ధిస్తున్న తీరులో నేను మాట్లాడటం ఎప్పటికీ జరగదు.” అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

Related posts