telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

జనం ఎక్కువగా ఉండే చోటుకి వెళ్లకండి… కరోనాపై ఎన్టీఆర్, రామ్ చరణ్ వీడియో

ramcharan-ntr

కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయడం కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విజయ్ దేవరకొండతో ఒక ప్రకటన వీడియోను విడుదల చేసింది. ప్రస్తుతం RRR చిత్రంలో నటిస్తోన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి కరోనా వైరస్ సోకకుండా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక వీడియోను విడుదల చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచించిన ఈ 6 సూత్రాలను పాటిస్తే మనం కోవిడ్ 19 వైరస్ నుంచి సులువుగా బయటపడొచ్చని వివరించారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ చెప్పిన ఆ ఆరు సూత్రాలు ఇవే..
1. చేతులను సబ్బుతో మోచేతి వరకు శుభ్రంగా కడుక్కోవాలి. గోళ్ల సందుల్లోను కూడా. బయటికి వెళ్లొచ్చినప్పుడు, భోజనం చేయడానికి ముందు.. ఇలా కనీసం రోజుకి ఏడెనిమిది సార్లు చేయాలి.
2. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టే వరకు తెలిసినవాళ్లు ఎదురుపడితే.. కౌగిలించుకోవడం, షేక్ హ్యాండ్స్ ఇవ్వడం మానేయాలి. అనవసరంగా కళ్లు రుద్దుకోవడం, ముక్కు తుడుచుకోవడం, నోట్లో వేలు పెట్టుకోవడం కూడా మానేయాలి.
3. మీకు పొడి దగ్గు, జ్వరం, జలుబు ఉందనిపిస్తేనే మాస్కులు వేసుకోవాలి. ఏమీ లేకుండా వేసుకుంటే అనవసరంగా కోవిడ్ 19 వైరస్ మీకు అంటుకునే ప్రమాదం ఉంది.
4. ఇంకో ముఖ్యమైన విషయం.. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు అరచేతులు కాకుండా మోచేతిని అడ్డం పెట్టుకోవాలి.
5. జనం ఎక్కువగా ఉండే చోటుకి వెళ్లకండి.
6. మంచి నీళ్లు ఎక్కువగా తాగండి. గడగడ అని తొందరగా తాగేకన్నా ఎక్కువ సార్లు కొంచెం కొంచెం సిప్ చేయండి. వేడి నీళ్లయితే ఇంకా మంచిది.

ఈ ఆరు సూత్రాలు చెప్పడంతో పాటు కరోనా వైరస్‌పై వచ్చే తప్పుడు వార్తల పట్ల కూడా ఈ ఇద్దరు స్టార్ హీరోలు జాగ్రత్తలు చెప్పారు. వాట్సాప్‌లో వచ్చే ప్రతి వార్తను నమ్మొద్దని సూచించారు. దీని వల్ల అనవసరంగా భయాందోళన పరిస్థితులు నెలకొంటాయని వెల్లడించారు. ఇది వైరస్ కన్నా ప్రమాదకరమని చెప్పారు.

Related posts