telugu navyamedia
సినిమా వార్తలు

ప్రేమ పయనం…

mana prema poetry corner

పరిమళాల పూదోటవై
విరబుస్తూ
వికసిత పద్మసోయగమై
అలరిస్తూ
ఆనందాల సైయాటలు
ఆడేస్తూ
నీ సుందరరూపం చూసి
పులకిస్తూ
నీ లావన్య రూపం వర్ణనకు 
అందగా
ఆనంద సమ్మేళనమైనది
నామాది
దేహాలు రెండైనా ప్రాణాలు
ఒక్కటిగా
అలకలమాని కౌగిలి
దరిచేరిపో
స్వేచ్చా జీవులమై అంబరాన
చిత్రీద్దాం
ఇంద్రధనస్సు రంగుల 
జీవన పయనం

-శివేగారి చిన్నికృష్ణ,
పలమనేరు

Related posts