telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాగశౌర్య కొత్త చిత్రం ప్రారంభం

Nagashourya

యంగ్ హీరో నాగశౌర్య తర్వాత సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది. సుబ్రహ్మణపురం దర్శకత్వం వహించిన సంతోష్ జాగర్లపుడి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఇందులో నాగ శౌర్య కు జంటగా కేతిక శర్మ నటిస్తుంది. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కాగా ఇది లైన్ లో ఉండగానే నాగశౌర్య హీరోగా టాలెంటెడ్ దర్శకుడు అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా ఇటీవలే కన్ఫామ్ అయిన విషయం తెలిసిందే. గత కొన్నాళ్ల కితమే ప్రకటించబడిన ఈ చిత్రం ఇపుడు పూజా కార్యక్రమంతో లాంచ్ అయ్యింది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్న ఈ చిత్రం లాంచ్ లో ప్రముఖ ఇండస్ట్రీ పెద్దలు పాల్గొన్నారు. నిర్మాత నాగవంశీ మేకర్స్ కు స్క్రిప్ట్ ను అందించగా ముహూర్తం షాట్ ను అనీల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అలాగే దర్శకుడు కొరటాల శివ క్లాప్ కొట్టగా నారా రోహిత్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. ఈ చిత్రానికి ప్రస్తుత యువ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ మహతి స్వర సాగర్ సంగీతం అందించనుండగా ఐరా క్రియేషన్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూట్ ను డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది.

Related posts