telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్ లుక్ లో నాగశౌర్య…!?

Nagashourya

నాగ శౌర్య ప్ర‌స్తుతం లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 8గా వస్తున్న ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు సమాచారం. ఈ సినిమా కోసం భారీగా కండ‌లు పెంచిన‌ట్టు తెలుస్తుంది. మ‌రోవైపు నాగ‌శౌర్య ప్ర‌స్తుతం త‌న సొంత నిర్మాణ సంస్థ అయిన ఐరా క్రియేషన్స్ లో ‘అశ్వద్ధామ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ నిర్మాణంత కార్యక్రమాలు జరుపుకుంటుంది. నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేయనున్నారు. అయితే… ఈ మ‌ధ్య కాలంలో హీరోలు అందరు సిక్స్ ప్యాక్స్ ట్రై చేస్తున్నారు. జిమ్‌లో గంట‌ల కొద్ది గ‌డుపుతూ, ట్రైన‌ర్ చెప్పిన డైట్ ఫాలో అవుతూ స‌రికొత్త లుక్ లోకి మారుతున్నారు. తాజాగా నాగ‌శౌర్య కూడా కండ‌లు పెంచి షాకింగ్ లుక్ లోకి మారాడు. ఆయ‌న లుక్ చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మరి నాగశౌర్య ఏ సినిమా కోసం ఇలా మేకోవర్ అయ్యారో తెలియాల్సి ఉంది.

Related posts