కరోనా వైరస్‌తో దేశం అల్లాడుతుంటే.. కొత్తగా బ్లాక్ ఫంగస్ (Black fungus) కలవరపెడుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదో ఒక రూపంలో సోకుతోంది. మొదటి దశలో విరుచుకుపడిన కరోనాతో పోల్చితే.. రెండో దశ వైరస్ చాలా ప్రమాదకరంగా ఉంది. ఈ వ్యాధికి గురవుతున్న బాధితుల సంఖ్యే కాకుండా.. మరణాలు కూడా పెరగడం కలచివేస్తోంది. ముఖ్యంగా వైరస్ శరవేగంగా ఊపిరితీత్తుల్లోకి చేరుతోంది. దీంతో బాధితులు ఆక్సిజన్ తీసుకోడానికి ఇబ్బందిపడుతున్నారు. చివరికి ప్రాణాలు వీడుతున్నారు
కరోనాకు తోడు ‘బ్లాక్ ఫంగస్’ అనే వ్యాధి మరింత కలవరానికి గురిచేస్తోంది. దీన్ని మ్యుకర్‌మైకోసిస్ (Mucormycosis) అని కూడా పిలుస్తున్నారు. మొన్నటి వరకు ఢిల్లీకే పరిమితమైన ఈ ఫంగస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా కనిపించడంతో ప్రజలు ఆందోళనకు గురవ్వుతున్నారు. అయితే ఈ బ్లాక్ వైరస్ పై మరో షాకింగ్ వార్త వైరల్ అవుతోంది. ఒకే మాస్క్ ను ఉతకకుండా రోజుల తరబడి ధరిస్తే, శుభ్రంగా లేని మాస్కులు ధరిస్తే బ్లాక్ వైరస్ వచ్చే ముప్పు ఉంటుందంటున్నారు నిపుణులు. ఏ రోజుకు ఆ రోజు మాస్క్ ను శుభ్రంగా ఉతుక్కున్న తర్వాతే వినియోగించడం మంచిదని చెబుతున్నారు. వెంటిలేషన్ సరిగ్గాలేని ఇళ్లల్లో ఉండేవారికి కూడా బ్లాక్ ఫంగస్ సోకే అవకాశాలు ఎక్కువన్నారు.అయితే ఇందుకు క్లినికల్ ఆధారాలు ఏవీ లేవని ఇంకొందరు వైద్య నిపుణులు పేర్కొనడం గమనార్హం.
previous post
next post
గవాస్కర్ వ్యాఖ్యల పై స్పందించిన ఇంగ్లాండ్ ఆటగాడు…