telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అండర్ వరల్డ్ డాన్ కిచ్చా సుదీప్ !

కిచ్చా సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఫాంటమ్’. అనూప్ భండారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గత యేడాది మార్చి1 హైదరాబాద్ లో మొదలైంది. కరోనా కారణంగా కొంతకాలం షూటింగ్ ను ఆపేసిన చిత్ర బృందం… అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ తిరిగి జులై 16న హైదరాబాద్ లోనే మలి షెడ్యూల్ ను జరిపింది. ఓ రకంగా కరోనా సమయంలోనూ షూటింగ్ జరిపి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచాడు కిచ్చా సుదీప్. ఈ సినిమా షూటింగ్ అత్యధిక భాగం ఫిల్మ్ సిటీలోనూ, అన్నపూర్ణ స్టూడియోలోనూ జరిగింది. ఆ తర్వాత కేరళ, మహారాష్ట్రలలోని పలు ప్రదేశాలలో చిత్రీకరణ జరిపారు. తాజా ఈ మూవీ షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది. వరల్డ్ ఫేమస్ బుర్జ్ ఖలీఫా టవర్స్ లో ఈ నెల 31న ఈ మూవీ టైటిల్ లోగో ను, స్నీక్ పీక్ ను విడుదల చేయబోతోంది మూవీ టీమ్. విశేషం ఏమంటే… ఇంతకాలం ‘ఫాంటమ్’గా ఉన్న పేరును ‘విక్రాంత్ రోనా’గా మార్చామని, ఇది సుదీప్ పోషిస్తున్న అండర్ వరల్డ్ డాన్ పాత్ర పేరని నిర్మాత జాక్ మంజు తెలిపారు! ఆ కొత్త టైటిల్ లోగో, 130 సెకన్ల స్నీక్ పీక్ కోసం సుదీప్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related posts