telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

భారీ మూవీ ప్లాన్‌ చేసిన షారుక్ ?

బాలీవుడ్ యంగ్ యాక్టర్ కార్తీక్ ఆర్యాన్2కు ఎంతో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కథలతో అలరిస్తుంటాడు. ఇతడు చేస్తున్న తాజా చిత్రాలు భూల్ భులైయా2, దోస్తానా2 సినిమాలు కరోనా కారణంగా ఆలస్యం అయ్యాయి. ఇదిలా ఉండగానే ఈ నటుడు తన తదుపరి చిత్రాన్ని ప్రకటించేందుకు సిద్దమయ్యాడు. బాలీవుడ్ స్టార్ దర్శకుడు అజయ్ భల్ నూతన చిత్రంలో కార్తీక్ హీరో చేయనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా వార్త ప్రస్తుతం బాలీవుడ్2లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త ఇంతలా హల్ చల్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఈ సినిమాను బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నిర్మించనున్నాడట. షారుఖ్ ఖాన్ బ్యానర్ రెడ్ చిల్లీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై ఈ సినిమా రూపొందనుందట. ఈ మేరకు కార్తీక్ ఫారుఖ్ ను సంప్రదించాడని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో పాటుగా గత కొంతకాలంగా షారుఖ్ ఖాన్ బ్యానర్ పై సినిమా రానుందన్న వార్తు గత కొంత కాలంగా బాలీవుడ్ సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మళ్లీ ఇప్పడు ఈ వార్త వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారట.

Related posts