నల్లగొండ జిల్లా మొత్తం ఫ్లోరైడ్‌తో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడి ప్రజలు ఫ్లోరైడ్‌తో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామికి సొంత ఇంటి కల నెరవేర్చింది టీఆర్ఎస్ పార్టీ. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా అంశాల స్వామికి ఇల్లు నిర్మాణం చేయించేందుకు ముందుకు వచ్చారు టీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్. ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రి కేటీఆర్ ని ప్రగతి భవన్ లో అంశాల స్వామి కలిశాడు. ఈ సందర్భంగా స్వామి సొంత ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు కేటీఆర్. స్వామికి సొంత ఇంటి నిర్మాణం చేయించేందుకు ముందుకు వచ్చిన విద్యాసాగర్ కి మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ప్రభుత్వం తరఫున డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం అంశాల స్వామి మాట్లాడుతూ… మిషన్ భగీరథ ద్వారా క్రమంగా ఫ్లోరైడ్ దూరమవుతుందన్నారు. దీని కోసం ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుని కలిసి ధన్యవాదాలు తెలుపుతామని పేర్కొన్నాడు స్వామి.
previous post
next post
మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ: కుటుంబ రావు