telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వెల్లంపల్లిపై చంద్రబాబు కౌంటర్‌..కొబ్బరి చిప్పలు అమ్ముకునే మంత్రి అంటూ

chandrababu tdp

ఇవాళ విజయవాడలో చంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టారు. ఈ ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయకులే అన్ని చోట్లా ముందుండాలంటే కష్టమని అభ్యర్ధులే ముందుండాలని తెలిపారు. గుంటూరు-విజయవాడలను కలుపుతూ అమరావతి రాజధాని నిర్మాణం చేయాలని భావించామని తెలిపారు. అమరావతి కోసం ఎవరైనా పోరాడుతున్నారా..? మీరు ఇంట్లో పడుకుంటే నేను పోరాడాలా..? అని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతి విషయంలో బెజవాడలో ఇంటికోకరు ఎందుకు రావడం లేదు…? అని ప్రశ్నించారు. హైదరాబాద్, బెంగళూర్‌, చెన్నై వెళ్లి పాచి పనులు చేయడానికి సిద్దంగా ఉన్నారు కానీ.. అమరావతి కోసం పోరాడడానికి సిద్దంగా లేరని ఆవేదన వ్యక్తం చేశారు. రోషం, పట్టుదల ప్రజల్లో ఎక్కడుంది ? పట్టిసీమ నాకోసం తెచ్చానా..? నీళ్లు తాగే వాళ్లకి అర్ధం కాదా..? అని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇవాళ రెండు వేలిస్తే ఓట్లేయండి.. ఆ తర్వాత ఊడిగం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే మంత్రి ఉన్నారని…వెల్లంపల్లిపై సెటైర్‌ వేశారు చంద్రబాబు. దుర్గమ్మ సన్నిధిలో అవినీతి జరిగితే రోషం రావడం లేదని.. దుర్గమ్మ సన్నిధిలో అవినీతి కంపు కొడుతుంటే.. ప్రజలు ఆనందంగా పడుకుంటున్నారని తెలిపారు. వెండి సింహాలు ఏమయ్యాయి..? నా మీద అభిమానం అక్కర్లేదు.. అమ్మవారి మీద కూడా అభిమానం లేదా..? అని ప్రశ్నించారు. అమ్మవారిని కాపాడుకోవాల్సిన అవసరం లేదా..? అమ్మవారు కన్ను తెరిస్తే కానీ మీరు స్పందించరా..? అని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న చిన్న విషయాలను పక్కన పెట్టండి.. చిల్లర రాజకీయాలు వద్దని కోరారు. విజయవాడ మేయర్ గెలవకుంటే తలెత్తుకు తిరగలేరని తెలిపారు. మనం కలిసుంటేనే బలం.. లేకుంటే మనల్ని కొడతారని.. ఆ తర్వాత నేనూ ఏం చేయలేక ఓ దండం పెట్టాల్సి వస్తుందన్నారు.

Related posts