‘లవ్ స్టోరీ’ సినిమాలోని ‘సారంగదరియా’కు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సాంగ్ లిరిక్స్ కు, మ్యూజిక్ కు, మంగ్లీ వాయిస్ కు, అందులో సాయి పల్లవి డాన్స్ కు, హావభావాలకు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఈ సాంగ్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ‘సారంగదరియా’ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ దాటింది. సౌత్ లో ఒక పాటకు ఇంతటి ఆదరణ రావడం విశేషం. గతంలో కూడా సాయి పల్లవి, ధనుష్ జంటగా నటించిన ‘మారి’ చిత్రంలోని ‘రౌడీ బేబీ’ సాంగ్ 800 మిలియన్ల వ్యూస్ దాటేసి హిస్టరీ క్రియేట్ చేసింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నటించిన ‘ఫిదా’ చిత్రంలోని ‘వచ్చిండే’ సాంగ్ 200 మిలియన్ల వ్యూస్ దాటింది. ప్రస్తుతం ఈ సాంగ్ 300 మిలియన్ వ్యూస్ దాటడానికి అతి చేరువలో ఉంది. కాగా ఇందులో ‘వచ్చిండే, సారంగదరియా’ సాంగ్స్ రెండూ సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందినవే. తాజాగా ‘సారంగదరియా’ సాంగ్ 150 మిలియన్ వ్యూస్ దాటేయడంతో సాయి పల్లవి ఖాతాలోకి మరో కొత్త రికార్డు చేరింది.
previous post
next post