telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నక్సలైట్ గా .. రానా ..

Rana

రానా నిన్నమొన్నటి వరకూ రెండు హిందీ సినిమాలతో బిజీగా ఉంటూ వచ్చాడు. ఇప్పుడు ఆ సినిమాలు ముగింపు దశకి చేరుకోవడంతో, తదుపరి ప్రాజక్టులైన తెలుగు సినిమాలపై దృష్టి పెట్టాడు. గుణశేఖర్ దర్శకత్వంలో ఆయన ‘హిరణ్యకశిప’ చేయనున్న సంగతి తెలిసిందే. ఆ పాత్రకి తగినట్టుగా కనిపించడానికి ఆయన అవసరమైన కసరత్తు చేస్తున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా జూన్ లో సెట్స్ పైకి వెళ్లనుంది.

వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా ‘విరాటపర్వం 1992’ అనే సినిమా చేయనున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందే ఈ సినిమాలో నక్సలైట్ గా రానా కనిపించనున్నాడని అంటున్నారు. వ్యవస్థలోని అవినీతిని ప్రశ్నించి ఎదిరించే విప్లవ భావాలు కలిగిన నక్సలైట్ పాత్రలో ఆయన అదరగొట్టనున్నాడని చెబుతున్నారు. రానా సరసన సాయిపల్లవి నటించనున్న ఈ సినిమాలో, ఒక ముఖ్యమైన పాత్రలో ‘టబు’ కనిపించనుంది.

Related posts