బిగ్ బాస్ లో ఒక ఎలిమినేట్ జరగటం, వైల్డ్ కార్డు ఎంట్రీ అంటూ ఇంట్లోకి ట్రాన్స్‌జెండర్ తమన్నా ఎంట్రీ ఇవ్వడం, మొదటి రోజే సందడి చేయడం చకచకా జరిగిపోయాయి. చీరకట్టుతో తల కొప్పుకి మల్లెపూలు పెట్టుకొని సంప్రదాయబద్దంగా ఇంట్లోకి అడుగుపెట్టింది. అందరితో కలివిడిగా ఉంటూ ఇంట్లో పరిస్థితుల గురించి చర్చించింది. నామినేషన్ ప్రక్రియలోను పాల్గొన్న తమన్నా.. వరుణ్ సందేష్, వితికలని నామినేట్ చేసింది. శ్రీముఖి, రవికృష్ణల పర్యవేక్షణలో పలు స్టెప్పులు చేసి వావ్ అనిపించింది. ముందుగా క్లాసికల్ డ్యాన్స్‌తో శెభాష్ అనిపించిన తమన్నా వెస్ట్రన్ డ్యాన్స్ కూడా చేసింది. శ్రీముఖి పాపులర్ స్టెప్ రాములమ్మ డ్యాన్స్ కూడా చేసింది. రవికృష్ణ ఓ ముత్యాల రెమ్మా.. అని పాట పాడుతుంటే తమన్నా అందుకు తగ్గట్టు స్టెప్పులు వేసి అలరించింది. ఇంటి సభ్యులు అందరు ఆమెకి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇక హేమ ఇంటి నుండి బయటకి వెళ్ళడంతో కిచెన్ బాధ్యతలని ఎవరు తీసుకోవాలా అని పలు చర్చలు జరిపారు. వితికతో పాటు శ్రీముఖి, అషూ రెడ్డి కిచెన్ పనులతో బిజీ అయ్యారు.
సోమవారం రోజు బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ ప్రక్రియలో ఇంటి సభ్యులు కన్ఫెషన్ రూంలోకి వెళ్ళి ఓ ఇద్దరిని నామినేట్ చేసి అందుకు గల కారణాలు వివరించమని చెప్పారు. అంతేకాదు నామినేషన్ గురించి ఇంటి సభ్యులతో చర్చించొద్దని పేర్కొన్నారు. ముందుగా హిమజ కన్ఫెషన్ రూంలోకి వెళ్ళి పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్‌ని నామినేట్ చేసింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్.. జాఫర్, శ్రీముఖిని నామినేట్ చేశాడు. అన్షూ.. శ్రీముఖి, రాహుల్‌ని నామినేట్ చేసింది. మధ్యలో వితికా.. వరుణ్ సందేశ్ చెవిలో గుస గుసలాడడంతో ఆమె నామినేట్ చేసే అవకాశాన్ని కోల్పోయిందని బిగ్ బాస్ తెలియజేశాడు. రాహుల్.. హిమజ, శ్రీముఖిని నామినేట్ చేసి పలు కారణాలు వివరించాడు. ఆ తర్వాత కన్షెషన్ రూంలోకి ఎంట్రీ ఇచ్చిన సావిత్రి .. శ్రీముఖి, జాఫర్‌లని నామినేట్ చేసింది. అలీరాజా.. హిమజ, వరుణ్ సందేశ్‌లని నామినేట్ చేశాడు. రవికృష్ణ.. హిమజ, జాఫర్‌లని నామినేట్ చేశాడు. జాఫర్.. వితికా, మహేష్‌లని నామినేట్ చేశాడు. రోహిణి.. పునర్నవి, మహేష్‌లని నామినేట్ చేసింది. మహేష్.. వితికా, వరుణ్ సందేశ్‌లని నామినేట్ చేశాడు. శ్రీముఖి.. హిమజ, మహేష్ విట్టాలని నామినేట్ చేసింది. ఇక పునర్నవి.. . పునర్నవి.. హిమజ, శ్రీముఖి లని నామినేట్ చేయగా, తమన్నాసింహాద్రి .. వరుణ్ సందేష్, వితికలని నామినేట్ చేసింది.
నామినేట్ చేసే విషయంలో బాబా భాస్కర్ చాలా మొండికేశాడు. నాకు అందరు మంచిగా అనిపిస్తున్నారు. నేను ఎవరిని నామినేట్ చేయాలనుకోవడం లేదు అని బిగ్ బాస్‌కి చెప్పాడు బాబా. కాని రూల్ ప్రకారం ఇద్దరిని తప్పక నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించిన ఆయన చెప్పేందుకు నిరాకరించాడు. దీంతో బిగ్ బాస్.. బాబా బాస్కర్ కనుక నామినేట్ చేయకపోతే అందరు నామినేట్ కావల్సి వస్తుందని చెప్పడంతో చివరికి వితిక, రాహుల్ ని నామినేట్ చేశాడు. మొత్తంగా నామినేషన్ ప్రక్రియలో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్‌లు ఈవారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యారు. ఒకేసారి ఎనిమిది మంది నామినేట్ కావడం విశేషం కాగా.. ఎక్కువ మంది శ్రీముఖి, హిమజలను నామినేట్ చేశారు. బిగ్ బాస్ హౌజ్‌లో వాటర్‌తో పాటు గ్యాస్‌ని కూడా నిలిపివేసినట్టు నిన్నటి ఎపిసోడ్ ప్రోమోలో చూపించారు. మరి సడెన్‌గా అన్నీ ఆపేయడంతో బిగ్ బాస్ హౌజ్‌లో ఇంటి సభ్యులు ఎలా రియాక్ట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.
“బిగ్ బాస్”పై గీతా మాధురి కామెంట్స్