telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసిన టాలీవుడ్ స్టార్స్

Bakrid

ఆగ‌స్ట్ 1, శనివారం బక్రీద్ పండుగ. ఈ సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ మెగాస్టార్ చిరంజీవి, క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు, సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ ముస్లిం సోద‌రుల‌కు సోష‌ల్ మీడియా ద్వారా బక్రీద్ శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేశారు. ‘‘ఈద్ ముబార‌క్‌, ఆనంద‌క‌ర‌మైన‌, ఆరోగ్య‌క‌ర‌మైన‌, శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను. 2020లో మీరు ప్రేమ‌, సంతోషాల‌ను వ్యాప్తి చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ‘‘త్యాగానికి చిహ్నమైన బక్రీద్ పండుగ శుభాకాంక్ష‌లు. మీ అంద‌రి ఇళ్లో సంతోషం ఉండాల‌ని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నాను’’ అంటూ మోహ‌న్ బాబు అన్నారు. ‘‘స‌ర్వ‌మాన‌వ సౌబ్రాతృత్వం నెల‌కొనాలి. దీన్ని మ‌నం సెల‌బ్రేట్ చేసుకోవాలి. ప్ర‌స్తుత‌మున్న ప‌రిస్థితుల‌ను దాటుకోవాలి. అంద‌రికీ ఇదొక శుభారంభం కావాలి’’ అంటూ మ‌హేశ్ అభినంద‌న‌లు తెలిపారు. ఇంకా పలువురు సెలెబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Related posts