telugu navyamedia
క్రీడలు వార్తలు

”ఐసీసీ టీం ఆఫ్ ది డికెడ్” జట్లు ఇవే…

ICC

తాజాగా ”ఐసీసీ టీం ఆఫ్ ది డికెడ్” ను ట్విట్టర్ వేదికగా ఐసీసీ ప్రకటించింది. అయితే ఇందులో భారత ఆటగాళ్లదే పై చేయి అని చెప్పాలి. ప్రస్తుత భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇందులో మూడు జట్లలో ఎంపిక కావడం మాత్రమే కాకుండా టెస్ట్ జట్టుకు కెప్టెన్ గా నిలిచాడు. అయితే ఈ లాంగ్ ఫార్మటు లో మరో భారత ఆటగాడు అశ్విన్ చోటుసంపాదించాడు. ఇక వన్డే అలాగే టీ20 జట్లకు కెప్టెన్ గా ధోని ఎన్నికవగా… వన్డేల్లో రోహిత్ శర్మ, కోహ్లీ ఎంపికయ్యారు. వీరితో పాటుగా పొట్టి ఫార్మాట్ లో బుమ్రా కూడా చోటు దక్కించుకున్నాడు. అయితే మూడు ఫార్మాట్లలో ఐసీసీ ఎంపిక చేసిన ఆటగాళ్లు వీళ్ళే…

టీ20 జట్టు: రోహిత్ శర్మ, క్రిస్ గేల్, ఆరోన్ ఫించ్, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, గ్లెన్ మాక్స్వెల్, ఎంఎస్ ధోని (c/wk), కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, జస్‌ప్రీత్ బుమ్రా, లసిత్ మలింగ

వన్డే జట్టు: రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్, విరాట్ కోహ్లీ, ఎబి డివిలియర్స్, షకీబ్ అల్-హసన్, ఎంఎస్ ధోని (c/wk), బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్, ట్రెంట్ బౌల్ట్, ఇమ్రాన్ తాహిర్, లసిత్ మలింగ

టెస్ట్ జట్టు : అలస్టేర్ కుక్, డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీ (c), స్టీవ్ స్మిత్, కుమార్ సంగక్కర (wk), బెన్ స్టోక్స్, రవిచంద్రన్ అశ్విన్, డేల్ స్టెయిన్, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్.

Related posts