పాకిస్థాన్‌లో ఈ ఉదయం రైలులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 16 మంది ప్రయాణీకులు సజీవ దహనమయ్యారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. లాహోర్ నుంచి కరాచీ వెళ్తున్న తేజ్‌గావ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. రహీమ్ యార్‌ఖాన్ సమీపంలోని లియాఖత్‌పూర్ వద్ద రైలులోని గ్యాస్ సిలిండర్ పేలి ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రైలులో చిక్కుకున్న వారిని రక్షించారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అంటుకున్న మంటలను నియంత్రించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు ఇతర బోగీలకు వ్యాపించకుండా తగు చర్యలు చేపట్టారు.
జగన్ నామినేషన్లు కూడా తెలంగాణలోనే వేస్తారా?: లోకేశ్