telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

కస్టమర్ల కోసం ఎస్‌బీఐ మరో ఆఫర్‌..కార్డు, పిన్‌తో పనిలేకుండా లావాదేవీలు

sbi logo

ఎస్‌బీఐ తన ఖాతాదారుల కోసం మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. చెల్లింపుల సమయంలో కార్డు మర్చిపోయాననో, పిన్‌ గుర్తుకు రావడం లేదనో బాధపడే వారికి ఇది శుభవార్త. ఇకపై కార్డు, పిన్‌తో పనిలేకుండా రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌ ఆధారంగా లావాదేవీలు నిర్వహించుకునేందుకు వీలుగా “ఎస్‌బీఐ కార్డు పే” సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే ఎస్‌బీఐ కార్డు మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోన్‌ నంబర్‌ను రిజిస్టర్‌ చేసుకుంటే చాలు.

షాపింగ్‌ మాల్‌, పెట్రోల్‌ బంక్‌…ఇలా ఎక్కడికి వెళ్లినా డబ్బు చెల్లించాల్సి వస్తే అక్కడి ‘పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ టర్మినల్‌’ వద్ద మొబైల్‌ ఫోన్‌ ఆధారంగా డబ్బు జమ చేయవచ్చు. అయితే ఈ సదుపాయం ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ కిట్‌ క్యాట్‌ వెర్షన్‌ 4.4, అంతకు మించి ఓఎస్‌ ఉన్న ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ ఫోన్‌లో మాత్రమే పొందే వీలుంటుంది. ఒక్కో లావాదేవీలో, రోజు వారీ లావాదేవీలో ఎంత ఖర్చు చేయాలన్న విషయం ఖాతాదారుడే నిర్ణయించుకోవచ్చని తెలిపింది.

Related posts