telugu navyamedia
క్రీడలు వార్తలు

క్రికెట్‌లో కోహ్లీ కంటే ఎక్కువ జీతం ఎవరికో తెలుసా…?

భారత కెప్టెన్‌గా ఆటగాడిగా కోహ్లీ ఎన్నో రికార్డులను అందుకున్నాడు. ఇటు ఆటలో.. అటు సంపాదనలోనూ ఈ రన్‌మెషిన్ దూసుకుపోతున్నాడు. దాంతో క్రికెట్ సారథుల్లో అత్యధిక జీతం అందుకునే కెప్టెన్ ఎవరంటే.. అందరూ టక్కున విరాట్ కోహ్లీ పేరే చెప్తారు. కానీ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ జీతం అందుకునే సారథి ఉన్నాడు. ఈ జాబితాలో విరాట్ రెండో స్థానంలో ఉన్నాడనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వేతనం పొందే కెప్టెన్ జోరూట్. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ అయిన రూట్‌ రూ.8 కోట్ల 97 లక్షల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. ఇక పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కు మాత్రం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు రూ. కోటీ 75 లక్షల వార్షిక వేతన్నానే అందిస్తుంది. జోరూట్ తర్వాత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీనే రూ. 7 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటున్నాడు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో విరాట్ కోహ్లీ ఏ+ గ్రేడ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అత్యంత ధనిక క్రికెట్‌బోర్డు, వరల్డ్ క్లాస్ ప్లేయర్ కోహ్లీ ఇలా రూ. 7 కోట్ల వేతనంతో సెకండ్ ప్లేస్‌లో ఉంటారని ఎవరూ ఊహించి ఉండరు. కోహ్లీ తర్వాత ఆస్ట్రేలియా సారథులు ఆరోన్ ఫించ్, టిమ్ పైన్ రూ. 5 కోట్ల 63 లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు.

Related posts