రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోత్తులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తో చర్చలు జరుపుతున్నట్లు ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు, క్రైస్తవ మతబోధకులు కేఏ పాల్ వెల్లడించారు. ఇరు పార్టీలు ఓ ఒప్పందానికి వచ్చి అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయడానికి ఈ చర్చలు ఉపయోగపడతాయని పాల్ స్పష్టం చేశారు. తమ మధ్య జరుగుతున్న చర్చల వివరాలు త్వరలో వెల్లడిస్తామని పాల్ పేర్కొన్నారు. తమతో పొత్తుల వల్ల జనసేన పార్టీయే ఎక్కువ లాభపడే అవకాశముందని పాల్ అభిప్రాయపడ్డారు. పవన్ ఒంటరిగా పోటీ చేస్తే మాత్రం ఒక్కసీటు కూడా గెలవలేరని అన్నారు. అందువల్ల పవన్ పొత్తుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పాల్ సూచించారు.
తాను స్థాపించిన ప్రజాశాంతి పార్టీలో చేరడానికి చాలా మంది నాయకులు సిద్దంగా వున్నారని పాల్ పేర్కొన్నారు ముఖ్యంగా అధికార టీడీపీ తో పాటు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, ఇతర పార్టీల నాయకులు కూడా తనతో టచ్ లో వున్నారని అన్నారు. తగిన సమయంలో వారంతా ప్రజాశాంతి పార్టీలో చేరతారని పాల్ వెల్లడించారు. ఇక తమ పార్టీకి ఎన్నికల సంఘం హెలికాప్టర్ గుర్తు కేటాయించినట్లు పాల్ తెలిపారు. ఇప్పటి నుండి ప్రజాశాంతి పార్టీ మరింత దూకుడుగా ముందుకు వెళుతుందని చెప్పారు. శనివారం సాయంత్రం 5 గంటలకు తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తామని పాల్ ప్రకటించారు.
తిరుమల బస్ టికెట్లపై “జెరూసలెం”.. స్వరూపానంద ఫైర్