telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

వ్యాక్సిన్ లేకుండా… కోవిడ్ కు కొత్త మందు!

Corona

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ప్రయోగాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారి శరీరంలో నుంచి వైరస్ ను పారద్రోలే ఔషధాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న ‘ఎబ్సెలీన్’ కరోనా శరీరంలో పునరుత్పత్తి కాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటుందని తేల్చారు. ఈ ఔషధాన్ని ఇప్పటికే పలు రకాల రుగ్మతలకు వినియోగిస్తున్నారు. ఇది యాంటీ వైరల్ గా, యాంటీ ఇన్ ఫ్లమేటరీగా, యాంటీ ఆక్సిడేటివ్ గా, బ్యాక్టీరిసైడల్ గా శరీరంలోని కణజాలాన్ని కాపాడేదిగా గుర్తింపు తెచ్చుకుంది.

శాస్త్రవేత్తల అధ్యయన ఫలితాలను ‘సైన్స్ అడ్వాన్సెస్’ జర్నల్ లో ప్రచురించింది. యూనివర్శిటీ ఆఫ్ చికాగో రీసెర్చర్లు వెల్లడించిన వివరాల ప్రకారం వైరస్ ఆర్ఎన్ఏ జన్యువుల్లో ఎంప్రో ప్రొటీన్లను తయారు చేయడం ద్వారా, అది ఆశ్రయించుకుని శరీరంలోని కణజాలంలో మరో వైరస్ ను పుట్టిస్తోంది. వేలాది బయొలాజికల్ మాలిక్యూల్స్ మోడల్స్ ను వినియోగించి, శాస్త్రవేత్తలు, వైరస్ కు వ్యతిరేకంగా పనిచేసే యాంటీ వైరల్ మెటీరియల్ ను గుర్తించారు. వైరస్ లోని ఎంప్రోను నివారించే ఆయుధంగా ఎబ్సెలీన్ పనిచేస్తుందని చికాగో వర్శిటీ ప్రొఫెసర్ జువాన్ డీ పాబ్లో వెల్లడించారు.

Related posts