telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ట్రైన్ టికెట్ .. మరొకరిపేరుతో ఇలా మార్చేయండి..

train ticket transfer procedure

మీరు బుక్ చేసుకున్న టికెట్ క్యాన్సిల్ చేసుకోకుండా వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు. దీని కోసం మీరు రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ‘ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్’ ప్రింట్ అవుట్‌తో పాటుగా ఒరిజినల్ ఫోటో ఐడీను తీసుకుని రైలు బయల్దేరడానికి 24 గంటల ముందే రైల్వే ఆఫీస్‌కు చేరుకోవాలి. పేరు మార్చడానికి రైల్వే కౌంటర్లో బుక్ చేసుకున్న టిక్కెట్లకు ఏ విధమైన నిబంధనలు వర్తిస్తాయో.. ఈ- టికెట్‌కు కూడా అవే నిబంధనలు వర్తిస్తాయి. సదరు ప్యాసింజర్… రైలు బయల్దేరే 24 గంటలు ముందు సమీపంలోని రైల్వే రిజర్వేషన్ ఆఫీస్‌లో రాతపూర్వకంగా దరఖాస్తు చేయాలి.

ఆ టికెట్‌ను ప్యాసింజర్ కుటుంబానికి మాత్రమే బదిలీ చేస్తారు తప్ప మరింకెవరికి మార్చరు. రైలు టికెట్‌ను కుటుంబ సభ్యుల్లో ఒకరికి బదిలీ చేయాలనుకున్నప్పుడు ‘ఎలక్ట్రానిక్ రిజర్వేషన్ స్లిప్’ ప్రింట్‌తో పాటు ఒరిజినల్ ఫోటో ఐడీ కార్డ్ తీసుకెళ్లాలి. ఎవరి పేరుకు మార్చాలనుకుంటున్నారో.. అతనికి, మీకు ఉన్న సంబంధాన్ని ధృవీకరించే ప్రూఫ్ ఒకదాన్ని మీ వెంట తీసుకువెళ్లాలి. దీనితో టికెట్ అధికారికంగా బదిలీ అయిపోతుంది.

Related posts