telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సాంకేతిక

చంద్రుడిపై .. విక్రమ్ లాండింగ్ … ఆ అద్భుతం చూడండి .. ఇలా..

all set to last stage for chandrayan-2

రేపే చంద్రయాన్-2 చంద్రుడిపై లాండింగ్, ఈ అంతరిక్ష అద్భుతం కళ్లారా చూసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 2లో మరో కీలక ఘట్టం జరగబోతోంది. శుక్రవారం అర్ధరాత్రి దాటక..చంద్రయాన్ 2లో భాగమైన విక్రమ్ ల్యాండర్.. జాబిల్లిపై ల్యాండ్ అవ్వబోతోంది. అర్ధరాత్రి 1.40 నుంచి 1.55 గంటల మధ్య ఈ ప్రయోగం జరగబోతోంది. ఈ 15నిమిషాలు ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో అత్యంత కీలకమైనవి.

దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు క్షణక్షణం ఉత్కంఠతో గడుపుతున్నారు. తమ 10ఏళ్ల కల తీరబోయే సమయం కోసం వారు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఘట్టానికి సంబంధించిన లైవ్‌ అప్‌డేట్స్‌ను మీ టీవీ9లో ప్రత్యక్షంగా వీక్షించండి.

Related posts